గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోటస్ సెలూన్, స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఒక జవాన్ చొరవతో వెలుగులోకి వచ్చింది. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠా బారిన పడి తన మేనల్లుడు డబ్బు పోగొట్టుకుంటున్నాడని గ్రహించిన జవాన్ నిఘా పెట్టడంతో, టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకున్నారు. గతంలో స్పా నిర్వాహకులు పోలీసుల మాదిరిగా బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.