మృతదేహంతో కలెక్టరేట్ వద్ద నిరసన

4చూసినవారు
వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడుకు చెందిన 42 ఏళ్ల డయాలసిస్ రోగి వెంకటేశ్వరరావు, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు 2018 నుంచి వస్తున్న పింఛన్ ఇటీవల నిలిచిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే మరణానికి కారణమని ఆరోపిస్తూ, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బుధవారం మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగి, బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్