గుంటూరు-చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ లారీ ప్రమాదశాత్తు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడుని 108సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థానికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.