శేకూరు గ్రామ వైస్ సర్పంచ్ మృతి

4చూసినవారు
శేకూరు గ్రామ వైస్ సర్పంచ్ మృతి
చేబ్రోలు మండలం శేకూరు గ్రామ వైస్ సర్పంచ్ యార్లగడ్డ సుబ్బారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శేకూరులోని సుబ్బారావు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బారావు మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు అంబటి మురళీకృష్ణ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్