
బస్సు కింద మంటలు.. తప్పిన పెను ప్రమాదం (వీడియో)
TG: హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో మంగళవారం గద్వాల డిపో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాట్‌ఫాంపై నిలిపి ఉన్న బస్సులో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు కండక్టర్ వెంటనే నీటితో మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు అందులో ప్రయాణికులు ఎవరూ లేరు, దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మెయింటెనెన్స్ లోపమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.




