
పోలవరం నిర్వాసితులకు అకౌంట్లలోకి నగదు జమ
AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఊరట లభించింది. ప్రభుత్వం రూ.1000 కోట్లను పంపిణీ చేసి, నిర్వాసితుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఏలూరు జిల్లా వేలేరుపాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రామనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల ప్రభావానికి లోనుకావద్దని ఆయన హెచ్చరించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యమని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.




