గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

4చూసినవారు
గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
గురువారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్ 8వ నంబర్ ప్లాట్‌ఫామ్ సౌత్ క్యాబిన్ వెనుక చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సుమారు 45-50 ఏళ్ల వయస్సున్న మృతుడి ఎడమ చేతికి 'Timeswing Quartz' వాచ్, ఆకుపచ్చ-నలుపు డిజైన్ లుంగీ ధరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైల్వే సీఐ అంజిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్