వట్టిచెరుకూరు: పీఈటీ అదృశ్యంపై కేసు

1393చూసినవారు
వట్టిచెరుకూరు: పీఈటీ అదృశ్యంపై కేసు
వట్టిచెరుకూరు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్న వెంకటరామకృష్ణ అదృశ్యంపై వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం నరవగోపాలపురం గ్రామానికి చెందిన వెంకటరామకృష్ణ ఏప్రిల్ 27న కళాశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఎస్సై బాబురావు తెలిపారు. ఆయన బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

సంబంధిత పోస్ట్