కృష్ణా నదిపై 25 వేల మందితో యోగాంధ్ర నిర్వహణ

4చూసినవారు
ఈ ఏడాది యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కృష్ణా నదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్‌పై సుమారు 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్రకు విశేష స్పందన లభించిందని గుర్తుచేశారు.