
జీజీహెచ్లో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధుడి మృతి
గుంటూరు జిల్లా పొత్తూరులో ఈ నెల 7న అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. స్థానికులు అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, వృద్ధుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






































