Feb 10, 2026, 01:02 IST/
టీ20 వరల్డ్ కప్.. నేడు మూడు మ్యాచ్లు
Feb 10, 2026, 01:02 IST
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా మంగళవారం మూడు మ్యాచులు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ఉ.11 గంటలకు నెదర్లాండ్స్, నమీబియా మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సా.3 గంటలకు న్యూజిలాండ్, యూఏఈ జట్లు తలపడనున్నాయి. ఎస్ఎస్సీ క్రికెట్ గ్రౌండ్లో రాత్రి 7 గంటలకు పాకిస్తాన్, యూఎస్ఏ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచులు చూడవచ్చు.