బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు, జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు 'ఫేస్ వాష్ అండ్ గో' అనే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఎస్పీ శబి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, తెల్లవారుజామున 1 నుండి 11 గంటల మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు. వాహనాలను ఆపి, డ్రైవర్లను ముఖం కడుక్కోవాలని, టీ తాగి మెలకువగా ఉండాలని, కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నిద్రమత్తులో వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సీఐ శేషగిరిరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.