ఏపీకి కేంద్రం శుభవార్త: 5,500 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు

10చూసినవారు
ఏపీకి కేంద్రం శుభవార్త: 5,500 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఈ-బస్సు పథకంలో భాగంగా రాష్ట్రానికి 5,500 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు 500 సీఎన్‌జీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. జులై నుంచి 750 బస్సుల్లో 300 బస్సులు, 2027 మార్చి నాటికి మరో 450 బస్సులు రోడ్లపైకి రానున్నాయి. తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, అమరావతి, గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో ఈ బస్సులు సర్వీసులు అందించనున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో 1450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పూర్వోదయ పథకం కింద వెయ్యి బస్సులు, పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 2 వేల బస్సుల మంజూరు కోసం ఏపీఎస్‌ఆర్టీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

సంబంధిత పోస్ట్