గుంటూరు బ్రాడీపేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆన్లైన్లో పరిచయమైన బ్రోకరేజ్ సంస్థల ద్వారా రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడికి రూ. 1. 80 కోట్ల లాభం చూపించినా, ఆ సొమ్మును తిరిగి ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఈమేరకు రామకృష్ణ గుంటూరు అరండల్పేట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సదరు బ్రోకరేజ్ సంస్థలు లాభంతో పాటు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు పేర్కొన్నారు.