గుంటూరు: ఎవరు ఇంటి నుంచి బయటకు రాకండి.. కలెక్టర్ సూచనలు

4632చూసినవారు
మొంథా తుఫాన్ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం కీలక సూచనలు చేశారు. తుఫాను ప్రభావం జిల్లాలో రేపు, ఎల్లుండి ఉంటుందని, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. అవసరమైన సరుకులను ముందే తెచ్చి ఉంచుకోవాలని, నగరంలో భారీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్