అక్టోబర్ 31, నేషనల్ యూనిటీ డే సందర్భంగా గుంటూరులో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిందాల్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమైక్యత కోసం వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.