గుంటూరులోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ గౌరవ దివాస్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై, బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత ఆదివాసీ స్వాతంత్ర్య పోరాటానికి బిర్సా ముండా నాయకత్వం వహించారని, చిన్న వయస్సు నుంచే బ్రిటీష్ పాలకులు, భూస్వాముల దోపిడీపై పోరాటం చేశారని కలెక్టర్ కొనియాడారు.