గుంటూరు: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

2737చూసినవారు
గుంటూరు: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
అరండల్పేట ఠాణాలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదైంది. రాజీవ్ గాంధీనగర్కు చెందిన మనోహర్ రెడ్డి, పద్మావతి దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నారు. గతంలో గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మనోహర్ రెడ్డి, గురువారం బంధువు దుకాణంలోని గదిలో నిద్రపోయారు. మధ్యాహ్నం మృతి చెంది ఉండటంతో తల్లి సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్