గుంటూరు: కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్

0చూసినవారు
గుంటూరు: కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్
గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి. ఎం. సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్జీల స్థితిగతులు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చని, అలాగే పీజీఆర్ఎస్‌తో పాటు మీకోసం వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్