కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, జాయింట్ కమిషనర్ భార్గవ్ తేజాలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్, వీధి పోటు, గ్రామకంఠం, అసైన్డ్ ల్యాండ్, భూసేకరణ, లేఅవుట్ డెవలప్మెంట్ సమస్యలపై జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.