గుంటూరులో బుధవారం రాత్రి 10: 30 గంటల నుండి 11: 30 గంటల వరకు గుంటూరు జిల్లా నగరంలోని ఈస్ట్, వెస్ట్ మరియు సౌత్ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని 08 ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించి, పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి మీద, బైక్ రేసింగ్ వంటి ఘటనలపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.