గుంటూరు: అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

2చూసినవారు
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. శంకర్ విలాస్ ఆర్వోబీ, మానస సరోవరం ఉద్యానవనం, గోరంట్ల తాగునీటి పథకం, నార్ల ఆడిటోరియం, నల్లపాడు చెరువు, అంబేడ్కర్ భవన్ నిర్మాణం, పీవీకే నాయుడు మార్కెట్, యూజీడీ, ఇన్నర్రింగ్ రోడ్డు మూడో దశ, సంక్షేమ వసతి గృహాల నవీకరణ పనులపై ఆమె సమీక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you