ఓటరు జాబితా సవరణకు పార్టీల సహకారం అవసరం: సీఈఓ

2చూసినవారు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 15 నుంచి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి గణన ఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులోగా ఫారమ్‌లు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కావని స్పష్టం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్