పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరిక: 'నన్ను వాడుకోవద్దు, శత్రువులు మన పార్టీలోనే'

1చూసినవారు
పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరిక: 'నన్ను వాడుకోవద్దు, శత్రువులు మన పార్టీలోనే'
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై, పార్టీపై జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తూ, 'మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు' అని ఘాటుగా హెచ్చరించారు. అమిత్ షాతో భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, కేంద్ర హోంమంత్రితో చర్చల విషయాలు బయటివారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జైలుకెళ్లాలని తాను కోరుకోలేదని, ఒక నాయకుడు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశానని వెల్లడించారు. పార్టీ అంతర్గత పరిస్థితులపై మాట్లాడుతూ, 'శత్రువులు బయట లేరు.. మన పార్టీలోనే ఉన్నారు' అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పదేపదే పరీక్షించే పరిస్థితి తీసుకురావద్దని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్