గుంటూరులోని రత్నపురి కాలనీ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చిన్నపాటి వర్షాలకే తమ ఇళ్లు, రోడ్లు మునిగిపోతున్నాయని, తమ సామాన్లు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ బాధను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.