పెదనందిపాడులో రహదారిపై వింతరాతలు

9చూసినవారు
పెదనందిపాడులో రహదారిపై వింతరాతలు
పెదనందిపాడు మండలం జరుగువారిపాలెం ప్రాంతంలో రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు వింత రాతలు రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాజకీయ వ్యాఖ్యలతో కూడిన వాక్యాలు రాయడంతో చర్చకు దారి తీసింది. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో వేగంగా వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.