వ్యభిచార, లాటరీ ముఠాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

1454చూసినవారు
వ్యభిచార, లాటరీ ముఠాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
గుంటూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. 30.10.2025న కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు వారి తోటలో ఒక హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులతో సహా ఆరుగురిని, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు వద్ద సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న వనిమిరెడ్డి నంది మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, రూ. 1,940 స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.