మెగా డీఎస్సీ అంశంపై గుంటూరులోని గుజ్జనగుండ్ల కూడలిలో
టీడీపీ,
వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు.
వైసీపీ నిర్వహించనున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమానికి ప్రతిస్పందనగా
టీడీపీ నేతలు "
వైసీపీ రాక్షస పాలన ముగింపుకు రెండేళ్లు" పేరుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా
టీడీపీ నేతలు
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒకేసారి రెండు పార్టీల కార్యక్రమాలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు అప్రమత్తమై గుజ్జనగుండ్ల సెంటర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.