గుంటూరులోని సంగం జాగర్లమూడి రైల్వే పట్టాలపై ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుంటూరు రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గుంటూరు గవర్నమెంట్ శవగారానికి తరలించారు. ఈ తరలింపు ప్రక్రియను గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.