గుంటూరులోని పట్నంబజారులో, ఐపిడి కాలనీకి చెందిన సబీరా ఖాన్ (33) అనే మహిళ మోతాదుకు మించి మాత్రలు మింగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పుట్టుకతో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న సబీరా, వైద్యులు ఇచ్చిన మాత్రలను గత నెల 19న మధ్యాహ్నం అధిక మోతాదులో మింగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.