వేధింపులకు మహిళ బలి.. ముగ్గురి అరెస్టు

2చూసినవారు
వేధింపులకు మహిళ బలి.. ముగ్గురి అరెస్టు
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపుల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మరణించింది. నిందితులను గుంటూరు స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.