
జంగమహేశ్వరంలో రేషన్ షాప్ సీజ్
గురజాల మండలం, జంగమహేశ్వరంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి మంగళవారం పర్యటించారు. రేషన్ దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించి, లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయకుండానే వేలిముద్రలు తీసుకుంటున్నారని గుర్తించారు. దీనితో దుకాణంలో 33 బస్తాలు అదనంగా ఉన్నాయని, వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆమె సూచించారు.




































