పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నిర్వహించిన వాక్-ఇన్ రిక్రూట్మెంట్ విజయవంతంగా పూర్తయింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో మొత్తం 8 పోస్టులకు గాను 79 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ వంటి విభాగాలకు చెందిన పోస్టులకు ఎంపిక ప్రక్రియ సజావుగా ముగిసిందని అధికారులు తెలిపారు.