డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ సమన్యాయం చేసేందుకే రాజ్యాంగాన్ని రచించారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. దాచేపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అనేకమంది పదవులు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు.