దుర్గాపై దాడి.. టీడీపీకి కాసు మహేష్ రెడ్డి మాస్ వార్నింగ్

0చూసినవారు
పిడుగురాళ్లలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దుర్గాపై జరిగిన దాడి రాజకీయంగా కలకలం రేపింది. గాయపడిన దుర్గాను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అవినీతి అంశాలను బయటపెడుతున్నందుకే దుర్గాపై కక్షపూరితంగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :