దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లుల కాలుష్యం కారణంగా ఆవుల నరసింహ (58) మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న కలుషిత నీరు, విష వాయువుల వల్లే ఆయన అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడని మృతుడి సోదరుడు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.