పల్నాడు జిల్లా దాచేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు తహశీల్దార్ జి. శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాలకు కార్యాలయం కారుతోందని, మరికొన్ని పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు ఆయన తెలియజేశారు.