విష వాయువులతో మృతి ఆరోపణ.. దాచేపల్లిలో ఆందోళన

10చూసినవారు
విష వాయువులతో మృతి ఆరోపణ.. దాచేపల్లిలో ఆందోళన
దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్టీ కాలనీ వాసులు తమ సమీపంలోని రసాయన పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష వాయువుల వల్లే తమ కాలనీకి చెందిన ఏ. నరసింహారావు (60) శ్వాసకోశ సమస్యలతో మృతి చెందారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాయువుల కారణంగా శ్వాసకోశ, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సీఐ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైద్య బృందం కాలనీలో నీటి నమూనాలను సేకరించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్