పొందుగలలో శిలాఫలకం ధ్వంసం

28చూసినవారు
దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో రూ. 4 లక్షలతో నిర్మించిన సీసీ రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆదివారం అర్ధరాత్రి సమయంలో పగులగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్