పల్నాడు జిల్లా గురజాలలో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం 36 ఒంగోలు జాతి వృషభాల మాల బండలాగుడు ప్రదర్శన జరిగింది. ఈ పోటీల్లో 8 ఎడ్ల జతలు పాల్గొని, ఉత్కంఠభరితమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.