గురజాల మండలం పులిపాడులో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.