శనివారం, పల్నాడు జిల్లాలోని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలం మొర్జంపాడు సమీపంలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ధర్మకర్తలు ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గర్భాలయంలోని బుగ్గ మల్లేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి మండపాన్ని, ఆలయ చరిత్ర శిలాఫలకాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.