పిడుగురాళ్లలో వ్యక్తి అదృశ్యం

పిడుగురాళ్ల పట్టణానికి చెందిన పల్నేడి వెంకటేశ్వర్లు (60) ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కుమారుడు పల్నేడి సుధీర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌లో మే 28న మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. అదృశ్యమైన వెంకటేశ్వర్లు పెద అగ్రహారం గ్రామానికి చెందినవారని పేర్కొన్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు పిడుగురాళ్ల సీఐ 9440796236, ఎస్సై 9381298419 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
