మల్లేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

400చూసినవారు
మల్లేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
భట్టిప్రోలు గ్రామంలో సోమవారం రాత్రి శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం (రథోత్సవం) కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే ఆనంద్ బాబు అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్