బుధవారం మాచవరం మండలం రేగుల గడ్డ, బెల్లంపల్లి, వేమవరం గ్రామాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాలను మాచవరం ఎంపీడీవో విష్ణు చిరంజీవి పరిశీలించారు. గత ఐదు రోజులుగా కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో నీరు ఆకుపచ్చ రంగులో మారిందని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నామని తెలిపారు. ల్యాబ్ పరీక్షలు వచ్చేవరకు ఎవరూ ఈ నీటిని వాడుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, ఎంసీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.