పల్నాడు: వైసీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడి

పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త మంద సాల్మాన్ పై శనివారం టీడీపీ నాయకుడు మోటమర్రి పేతురు కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో మంద సాల్మాన్ తలకు తీవ్ర గాయం కావడంతో, స్థానికులు అతన్ని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
