పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా గురువారం స్కాలర్స్ విద్యా సంస్థల ప్రాంగణంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించబడింది. ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడమే కాకుండా, పట్టణ ప్రజల్లో కూడా చైతన్యం సృష్టించేందుకు ఒక ర్యాలీ నిర్వహించబడింది. ర్యాలీలో విద్యార్థులు, సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణపై నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ప్రచారం నిర్వహించారు.