గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు శనివారం పిడుగురాళ్ల పట్టణంలో ఈనెల 12వ తేదీన ప్రారంభం కానున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం, వాటర్ ఫౌంటైన్, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డులోని ఐ లవ్ యూ పిడుగురాళ్ల బోర్డులను ఆయన పరిశీలించారు.