దాచేపల్లిలో వర్షం… ఎండలకు ఉపశమనం

7చూసినవారు
పల్నాడు జిల్లా దాచేపల్లిలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చిరుజల్లులు కురిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని అందించింది. అయితే, ఉదయం పూట పనుల నిమిత్తం బయలుదేరిన వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్