నరసరావుపేట కలెక్టరేట్లో సర్దార్ పటేల్ జయంతి

84చూసినవారు
నరసరావుపేట కలెక్టరేట్లో సర్దార్ పటేల్ జయంతి
శుక్రవారం కలెక్టరేట్లో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృత్తికా శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొని, సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.